గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 19:02:33

'క‌నుజు'ను ర‌క్షించిన గ్రామ‌స్తులు

'క‌నుజు'ను ర‌క్షించిన గ్రామ‌స్తులు

మహబూబాబాద్ : జిల్లాలోని కొత్తగూడ మండలం రేణ్యాతండా గ్రామపంచాయతీ పరిధి చిన్నతాండ‌కు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి కనుజు వ‌చ్చింది. క‌నుజును చూసిన కుక్క‌లు వెంట‌ప‌డి త‌రిమి గాయ‌ప‌రిచాయి. ఇది గ‌మ‌నించిన గ్రామ‌స్తులు కుక్కలను వెళ్లగొట్టి క‌నుజును రక్షించారు. అనంత‌రం అటవీశాఖ అధికారులకు సమాచారం అంద‌జేశారు. అధికారులు సంఘట‌నా స్థ‌లానికి చేరుకుని క‌నుజుకు చికిత్స చేసి వన విజ్ఞాన్ కేంద్రానికి త‌ర‌లించారు. 


logo