మంగళవారం 26 మే 2020
Telangana - Mar 26, 2020 , 09:45:22

నిర్మానుష్యంగా రోడ్లు..సామాజిక దూరం పాటిస్తున్న పల్లె వాసులు

నిర్మానుష్యంగా రోడ్లు..సామాజిక దూరం పాటిస్తున్న పల్లె వాసులు

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగో రోజు లాక్ డౌన్ విజయవంతంగా కొనసాగుతుంది. వేకువజాము నుంచే ప్రజలు ఎక్కడికక్కడ బయటకు రాకుండా ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బరంగ్ ఎదిగి వద్ద కామారెడ్డి-నిజామాబాద్ జిల్లాల సరిహద్దు రహదారి నిర్మానుష్యంగా మారింది. పల్లెల్లో నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముధెల్లి గ్రామంలో రేషన్ బియ్యం కోసం వచ్చిన వారి కోసం ఒక్కో వ్యక్తికి మీటరున్నర చొప్పున బాక్సులు కొట్టారు.  గ్రామస్తులు ఆ బాక్సుల్లో నిలబడి సామాజిక దూరం పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.  మరోవైపు వరంగల్ లోని కూరగాయల మార్కెట్ లో కూడా ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. 
logo