శనివారం 04 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 20:12:12

మా ఎంపీ కనిపించడం లేదు!

మా ఎంపీ కనిపించడం లేదు!

కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ కనిపించడం లేదని కొత్తపల్లి పట్టణ రైతులు స్థానిక పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసి, గెలిచిన తర్వాత ఏడాది దాటినా తమ పట్టణానికి రాలేదని, ఎంపీ జాడ తెలియజేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రెండు నెలల నుంచి కరోనా లాక్‌డౌన్‌ వల్ల  తాము అవస్థలు పడుతున్నా.. ఒక్క రోజు కూడా వచ్చి  చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ నిధులు ఏడాదికి రూ.5 కోట్లు మంజూరైనా తమ పట్టణాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని వాపోయారు. ఫిర్యాదు చేసిన వారిలో రైతులు కృష్ణహరి, ఎస్‌ శంకరయ్య, లక్ష్మయ్య, సీహెచ్‌ కనకయ్య తదితరులు ఉన్నారు.


logo