ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 17:26:15

విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం.. గ్రామ స‌ర్పంచ్ స‌స్పెన్ష‌న్‌

విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం.. గ్రామ స‌ర్పంచ్ స‌స్పెన్ష‌న్‌

రాజ‌న్న సిరిసిల్ల : విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన కారణంగా ఓ గ్రామ స‌ర్పంచ్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ విధుల నుంచి తాత్కాలికంగా తొల‌గించారు. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ సర్పంచ్ విధుల ప‌ట్ల అల‌స‌త్వం, నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించడం అదేవిధంగా అక్ర‌మ నిర్మాణాల‌ను నిలుపుద‌ల చేయ‌డంలో విఫ‌ల‌మైన కార‌ణంగా స‌ర్పంచ్ కొక్కు సంధ్య‌రాణిని క‌లెక్ట‌ర్ కృష్ణ భాస్క‌ర్ స‌స్పెన్ష‌న్ చేస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌రించారు.