గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 25, 2020 , 19:25:34

వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి.. సీఎం దిగ్భ్రాంతి

వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి.. సీఎం దిగ్భ్రాంతి

వికారాబాద్‌: గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు ఇవాళ ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీంఎం ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో సంజీవరావు వికారాబాద్‌ నియోజకవర్గంలో కీలక భూమిక పోషించారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం, 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఆయన విజయం సాధించారు. కాగా, అనారోగ్య కారణాల రీత్యా ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 


logo