గురువారం 04 జూన్ 2020
Telangana - May 02, 2020 , 02:11:45

హైకోర్టు జడ్జిగా విజయ్‌సేన్‌ రెడ్డి

హైకోర్టు జడ్జిగా విజయ్‌సేన్‌ రెడ్డి

  • కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు..నేడు ప్రమాణం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైకోర్టు న్యాయవాది బీ విజయ్‌సేన్‌రెడ్డిని తెలంగాణ హైకోర్టు న్యాయముర్తిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. శనివారం ఉదయం 11.30 గంటలకు విజయ్‌సేన్‌ రెడ్డి జడ్జిగా ప్రమాణం చేస్తారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకంతో హైకోర్టు జడ్జిల సంఖ్య 14కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టు న్యాయముర్తులుగా న్యాయవాదులు బీ కృష్ణమోహన్‌, కే సురేశ్‌రెడ్డి, కే లలితకుమారిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులుజారీచేసింది.logo