గురువారం 28 మే 2020
Telangana - May 22, 2020 , 06:27:02

రూల్స్ బ్రేక్..విజయశ్రీ కెమికల్స్‌ మూసివేత

రూల్స్ బ్రేక్..విజయశ్రీ కెమికల్స్‌  మూసివేత

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా  రసాయన వ్యర్థ జలాలను నాలాలోకి వదిలిన విజయశ్రీ కెమికల్స్‌ పరిశ్రమను పీసీబీ అధికారులు సీజ్‌ చేశారు. జీడిమెట్లలోని విజయ శ్రీ కెమికల్స్‌ కొంతకాలంగా పరిశ్రమ నుంచి నాలాలోకి నేరుగా పైపులైన్‌ వేసి వ్యర్థ జలాలను వదులుతున్నది. గురువారం పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు నిర్వహించి పట్టుకుంది.

వ్యర్థ జలాల శాంపిల్స్‌ను సేకరించి ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించిన అధికారులు ఆ కంపెనీ నుంచే వ్యర్థజలాలు నాలాలో కలుస్తున్నట్టుగా తేల్చారు.ఈ నివేదికను పీసీబీ సభ్య కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌కు అందజేశారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరిశ్రమను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo