శుక్రవారం 29 మే 2020
Telangana - Mar 28, 2020 , 18:19:13

మహమ్మారికి ప్రాణాలు తీయడం తప్ప దయాదాక్షిణ్యాలుండవు

మహమ్మారికి ప్రాణాలు తీయడం తప్ప  దయాదాక్షిణ్యాలుండవు

అమరావతి: కరోనా వైరస్‌  కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరిస్తేనే వైరస్‌ వ్యాపించకుండా అరికట్టగలమని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని ట్విటర్లో విజ్ఞప్తి చేశారు. 

ఈ ఆపత్కాలంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, గ్రామ, పట్టణాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునే పనుల్లో ఉన్న ఉద్యోగులందరినీ గౌరవించాలి. వారి మనసు నొప్పించేలా వాదనకు దిగొద్దు. మనం ఇళ్లలో ఉంటే వారంతా కుటుంబాలను వదిలి ఎండలో, హాస్పిటళ్లలో ప్రాణాలు రక్షించే విధుల్లో ఉన్నారు.

కరోనా మహమ్మారికి ప్రాణాలు తీయడం తప్ప  దయాదాక్షిణ్యాలుండవు. ఉన్నత స్థాయి వ్యక్తులను వదిలిపెట్టడం లేదు. బ్రిటన్ ప్రధాని, ప్రిన్స్ చార్లెస్, కెనడా ప్రధాని సతీమణి ఇలా ఎందరో ప్రముఖులకు సోకింది. సామాజిక దూరం పాటించకుండా అందరితో కలవడం వల్లనే వారంతా ఈ మృత్యు వైరస్ కు లొంగారు. అని విజయ సాయిరెడ్డి  పేర్కొన్నారు. 


logo