శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 18:03:32

విజయ మెగా డెయిరీ నమూనా సిద్ధం చేయాలి : మంత్రి తలసాని

విజయ మెగా డెయిరీ నమూనా సిద్ధం చేయాలి : మంత్రి తలసాని

హైదరాబాద్ : ఆధునిక టెక్నాలజీ తో 250 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే మెగా డెయిరీ నుంచి మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో.. మెగా డెయిరీ నిర్మాణం కోసం పశుసంవర్ధక శాఖకు చెందిన 32 ఎకరాల భూమిని, విజయ డెయిరీకి 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చే ప్రక్రియ ముగిసింది. 

మంత్రి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర సమక్షంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డెయిరీ ఎండీ శ్రీనివాస్ రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు త్వరలో చేయనున్న మెగా డెయిరీ నమూనా సిద్ధం చేయాలని మంత్రి ఆ సంస్థ ఎండీని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, తదితరులు ఉన్నారు.
logo