బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 14:18:06

విజయ డెయిరీ అవుట్ లెట్స్ మరిన్ని పెంచుతుతాం : మంత్రి తలసాని

విజయ డెయిరీ అవుట్ లెట్స్ మరిన్ని పెంచుతుతాం : మంత్రి తలసాని

మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాల ఉత్పత్తికి అనేక చర్యలు తీసుకుంటున్నారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్రంలో లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు తలసాని, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..తొర్రూర్ డివిజన్ కేంద్రంలో రూ. 6వేల కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. 1973లో తొర్రూర్ లో  విజయ డెయిరీకి ఇచ్చిన భూమిని కాపాడుకుందామన్నారు. ప్రభుత్వ భూములను అధికారులు కాపాడాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తం కావాలన్నారు.  విజయ డెయిరీ అవుట్ లెట్స్ మరిన్ని పెంచుతామన్నారు. సంక్షేమం, ప్రగతిలో రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. 

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలోనూ రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నదని తెలిపారు. ప్రజలు ఆందోళన చెంద వద్దు.  పాడి పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, వివిధ శాఖల అధికారులు. ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo