24 గంటల్లో వైరస్ గుట్టు తేల్చేస్తాం

- బ్రిటన్ స్ట్రెయిన్‌పై నేడో, రేపో పూర్తి స్పష్టత
- సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడి
- యూకే నుంచి వచ్చిన మరో ఇద్దరికి వైరస్
- 184 మంది వివరాలపై అధికారుల ఆరా
- అప్రమత్తంగా ఉన్న వైద్యారోగ్యశాఖ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బ్రిటన్ స్ట్రెయిన్‌పై పరిశోధన కొనసాగుతున్నదని, యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారి నమూనాలపై అధ్యయనం చేస్తున్నామని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. 24 గంటల్లో అంటే ఆదివారం సాయంత్రం లేదా సోమవారం మధ్యాహ్నం వరకు వైరస్ జన్యు క్రమంపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. దీంతో యూకే స్ట్రెయి న్ రాష్ట్రంలో ప్రవేశించిందా లేదా అనే విషయం తేలిపోనున్నదని అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సాధారణ కరోనా 100 మందికి వ్యాప్తి చెందే సమయంలో.. కొత్త రకం వైరస్ 150 నుంచి 200 మందికి అంటుకుంటుందని వివరించారు. వైరస్ గుర్తింపు, చికిత్స విషయంలో ఎలాం టి తేడా ఉండదని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు యూకే నుంచి 1,216 మంది తెలంగాణకు వచ్చారు. వీరిలో 937 మందిని గుర్తించిన వైద్యారోగ్యశాఖ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించింది. వీరిలో శుక్రవారం 16 మందికి వైరస్ నిర్ధారణ కాగా, శనివారం మరో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. ఈ 18 మందిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లావాసులు ఆరుగురు, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరికి సోకింది కొత్త రకం వైరస్ అవునో కాదో సీసీఎంబీ నివేదిక వచ్చాకే తేలనున్నది. వీరి తో కాంటాక్టులో ఉన్న 79 మందిని గుర్తించిన వైద్యారోగ్యశాఖ క్వారంటైన్ కేంద్రాల్లో చేర్పించింది. వీరందరికీ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది.
92 మంది ఇతర రాష్ర్టాలవారు..
యూకే నుంచి వచ్చినవారిలో 92 మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారు కాగా, అధికారులు వారి వివరాలను ఆయా ప్రభుత్వాలకు చేరవేశారు. మరో 187 మందికి సంబంధించిన వివరాలు సమగ్రంగా లేకపోవడంతో వారిని చేరుకోవడం కష్టంగా మారింది. పాస్‌పోర్టుల్లో పాత అడ్రస్, ఫోన్ నంబర్లు ఉండటంతో వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. డిసెంబర్ 9 తర్వాత రాష్ర్టానికి నేరుగా యూకే నుంచి వచ్చినవారు లేదా యూకే మీదుగా వచ్చినవారు 040-24651119కి ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ 9154170960లో సంప్రదించాలని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు విజ్ఞప్తిచేశారు.
కరోనా కొత్త కేసులు 317
రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం 30 వేల నమూనాలను పరీక్షించగా, 317 మందికి పాజిటివ్‌గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 71, రంగారెడ్డి జిల్లాలో 27, మేడ్చల్ మల్కాజిగిరిలో 25, వరంగల్ అర్బన్‌లో 11 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 97.13 శాతంగా ఉండగా, జాతీయ సగటు 95.8 శాతంగా నమోదైంది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 66.80 లక్షలు దాటింది.
తాజావార్తలు
- రేగు పండు.. ఖనిజాలు మెండు..!
- దీదీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన ఆటో.. ఇద్దరు దుర్మరణం
- కరెంట్ షాక్‌తో రైతు మృతి
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న నటుడు నవీన్ చంద్ర
- ఫేస్బుక్ నుంచి ఆటోమేటిగ్గా లాగౌట్.. ఎందుకు?
- మహా శివరాత్రి కానుకగా `జాతి రత్నాలు`
- ఆత్మనిర్భర్ భారత్‌లో యూపీ కీలకం : మోదీ
- ‘రైతు ట్రాక్టర్లకు డీజిల్ సరఫరా నిలిపివేయండి..’
- కృష్ణుడ్ని కలువాలంటూ.. భవనం పైనుంచి దూకిన మహిళ