శనివారం 11 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 11:30:46

నల్లగొండ జిల్లాలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు..

నల్లగొండ జిల్లాలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు..

నల్లగొండ : నాంపల్లి మండల కేంద్రంలోని విత్తన దుకాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో విత్తన నిల్వలు, దస్ర్తాలు, రశీదులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతులకు విత్తనాలు విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. దుకాణాల ఎదుట ధరల పట్టికను ఏర్పాటు చేయాలని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్స్‌ సీఐ, ఏఓ వెంకటప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo