బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 16:15:29

విద్యాసాగర్‌రావు సేవలు మరువలేనివి : మంత్రి జగదీశ్‌రెడ్డి

విద్యాసాగర్‌రావు సేవలు మరువలేనివి : మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రానికి ఆర్‌. విద్యాసాగర్‌రావు చేసిన సేవలు మరువలేనివని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాగునీటి రంగ నిపుణుడు, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆర్.విద్యాసాగర్‌రావు జయంతి సందర్భంగా నగరంలోని ఎర్రమంజిల్‌లోని ఇంజినీర్స్ భవన్‌, జలసౌధలో విద్యాసాగర్‌రావు విగ్రహాలను మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో సాగునీటి కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై విద్యాసాగర్‌రావు తుదివరకు పోరాడారని అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ భుజం తట్టి ప్రభుత్వ సలహాదారుగా ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఆర్.విద్యాసాగర్‌రావు చేసిన సేవలకు గౌరవ సూచకంగా ఆయన జయంతిని తెలంగాణ ఇరిగేషన్ డేగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది గుర్తుచేశారు. కార్యక్రమంలో నీటిపారుదల సెక్రటరీ రజత్‌కుమార్‌, పలువురు విశ్రాంత ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.