శనివారం 06 జూన్ 2020
Telangana - May 19, 2020 , 22:58:16

జువ్వాడి కుటుంబసభ్యులకు విద్యాసాగర్‌రావు పరామర్శ..

జువ్వాడి కుటుంబసభ్యులకు విద్యాసాగర్‌రావు పరామర్శ..

ధర్మపురి ‌: ఉమ్మడి రాష్ట్ర దేవాదాయశాఖ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు ఈనెల 10న మృతి చెందగా.. మంగళవారం తిమ్మాపూర్‌లో రత్నాకర్‌రావు కుటుంబసభ్యులను మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోరుట్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రత్నాకర్‌రావుతో సన్నిహితంగా ఉండేవాడినని, ఆ సమయంలో ఆయన ద్వారా అనేక రాజకీయ పాఠాలు నేర్చుకున్నానన్నారు. 

ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో కర్మయోగిని తలపించేలా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రత్నాకర్‌రావు అని కొనియాడారు. ఆయన కుమారులు నర్సింగరావు, కృష్ణారావు, చంద్రశేఖర్‌రావు తండ్రి అడుగుజాడల్లోనే నడవాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల బీజేపీ అద్యక్షులు బాబోజి భాస్కర్‌, భాస సత్యనారాయణరావు, నాయకులు మోరపల్లి సత్యనారాయణ, పిల్లి శ్రీనివాస్‌, వైకుంఠం తదితరులున్నారు.logo