బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 18, 2020 , 00:23:38

25 నుంచి వేద శాస్త్ర ఆగమ విద్వత్‌ సదస్సు

25 నుంచి వేద శాస్త్ర ఆగమ విద్వత్‌ సదస్సు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వేద పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు తిరుమలలో అఖిల భారత వేద శాస్త్ర ఆగమ విద్వత్‌ సదస్సు నిర్వహిస్తున్నట్టు తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ సదస్సులో 54 వేద శాఖలకు సంబంధించిన పరీక్షలు ఉంటాయని, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైనవారికి 5 గ్రాముల బంగారు డాలర్‌, ద్వితీయశ్రేణిలో నిలిచినవారికి 10 గ్రాముల వెండి డాలర్‌ను బహూకరిస్తామని టీటీడీ పేర్కొన్నది.


20న మహా సరస్వతియాగం

ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్‌, విద్యా విభాగం సంయుక్తంగా ఈ నెల 20వ తేదీన తిరుపతిలో మహాసరస్వతియాగం నిర్వహిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 10 వేల మంది విద్యార్థులతో ఈ యాగం జరుగుతుందని వివరించింది.


logo