శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 01:16:48

ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌లో విద్య, నిపుణ

ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌లో విద్య, నిపుణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీ-సాట్‌కు చెందిన విద్య, నిపుణ చానళ్లు ఇకపై ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌లో ప్రసారం కానున్నాయి. చానల్‌ నంబర్‌ 948, 949లో ప్రసారమయ్యేలా టీ-సాట్‌, ఎయిర్‌టెల్‌ శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని టీ-సాట్‌ కార్యాలయంలో చేసుకున్న ఈ ఒప్పందంపై టీ-సాట్‌ సీఈవో ఆర్‌ శైలేశ్‌రెడ్డి, భారతీ ఎయిర్‌టెల్‌ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల సీఈవో అవనీత్‌సింగ్‌పూరి సంతకాలు చేశారు. టీ-సాట్‌ నెట్‌వర్క్‌ చానళ్లు ఇప్పటికే డిజిటల్‌ ప్రసారాలు అందిస్తూ యూట్యూబ్‌లో 4 లక్షల సబ్‌స్ర్కైబర్స్‌ను కలిగి ఉన్నాయి. ఎయిర్‌టెల్‌తో ఒప్పందంతో పాఠశాల, ఇంటర్‌, డిగ్రీ, పీజీ చదివే లక్షల మంది విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూరనున్నది. టీ-సాట్‌ చానళ్లు తమ ప్రసారాల్లో మరో ముందడుగు వేశాయని సీఈవో శైలేశ్‌రెడ్డి తెలిపారు. కరోనా వేళ డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో తమ ప్రసారాలకు ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు. శనివారం నుంచి ఎయిర్‌టెల్‌ ద్వారా ప్రసారాలు చేసేలా ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.logo