శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 08:43:36

వీడియో.. ఆకట్టుకుంటున్న దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి

వీడియో.. ఆకట్టుకుంటున్న దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి

హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన 754.38 మీటర్ల పొడవైన త్వరలోనే అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదల చేసిన ఈ తీగల వంతెన అందాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో వీడియోను పంచుకోగా.. నగర ప్రజలను ఆకర్షిస్తోంది. రంగురంగుల విద్యుద్దీప కాంతులతో కళ్లు తిప్పుకోకుండా చేస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. రంగురంగుల విద్యుత్‌ కాంతులతో హైదరాబాద్‌ మొట్టమొదటి హ్యాంగింగ్‌ బ్రిడ్జిగా పేరొందడంతోపాటు పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లపై వాహనాల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ బిడ్జి నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీరింగ్‌ బృందాన్ని అభినందించారు. మౌలిక సదుపాయాల కల్పన వృద్ధికి కీలకమని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం 60శాతం బడ్జెట్‌ను ఖర్చు చేస్తోందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo