శనివారం 06 జూన్ 2020
Telangana - May 10, 2020 , 10:07:18

ప్రజల సహకారంతో కరోనాపై విజయం: మంత్రి జగదీష్‌ రెడ్డి

ప్రజల సహకారంతో కరోనాపై విజయం: మంత్రి జగదీష్‌ రెడ్డి

సూర్యాపేట: ప్రజల సహకారం, జిల్లా యంత్రాంగం కృషితో కరోనా మహమ్మారిని పూర్తిస్థాయిలో జయించగలిగామని రాష్ట్ర విద్యుత్‌శాక మంత్రి గుంటకట్ల జగదీష్‌ రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు సూర్యాపేటలో 12 నూతన కూరగాయల మార్కెట్లను ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 83 కరోనా కేసులు నమోదయ్యాని చెప్పారు. ఇప్పటివరకు 56 మంది పూర్తిగా కొలుకుని డిశ్చార్జి అయ్యారని చెప్పారు. మరో 27 మంది కూడా కోలుకుంటున్నారని తెలిపారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ఆరోగ్యంపై ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు బయటకు వెళ్లకుండా వారికి అందుబాటులో ఉండేందుకు నగరంలో పన్నెండు కూరగాయల మార్కెట్లను ప్రారంభించామని చెప్పారు.


logo