సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 00:44:38

బాధితులకు మనోధైర్యం కల్పించాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

బాధితులకు మనోధైర్యం కల్పించాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌: కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం హేయమైన చర్యని.. బాధితులకు మనోధైర్యం కల్పించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. మహబూబ్‌నగర్‌ జెడ్పీ సమావేశ మందిరంలో వివిధశాఖల అధికారులతో సమీక్షించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనాతో మృతిచెందితే వారి అంత్యక్రియల్లో పాల్గొనే వారికి కలెక్టరేట్‌ నుంచి పీపీఈ కిట్లు అందజేస్తారని తెలిపారు. ఐసోలేషన్‌లో ఉన్న వారిని వైద్య బృందం ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వారికి ధైర్యం చెప్పాలని సూచించారు. 


logo