బుధవారం 27 మే 2020
Telangana - May 12, 2020 , 15:16:24

ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసిన ఉప రాష్ట్రపతి

ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి ఫోన్  చేసిన ఉప రాష్ట్రపతి

 మహబూబ్‌నగర్‌ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి కి ఫోన్ చేశారు. ఎంపీ, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను గురించి వాకబు చేశారు. కరోనా మహమ్మారి కబళిస్తున్న ఈ విపత్కర ఈ పరిస్థితుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంపీకి సూచించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల గురించి వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా ఎంపీతో ఆరా తీశారు. 

కరోనా కట్టడి కోసం  ముఖ్యమంత్రి కేసీఆర్  పటిష్టమైన చర్యలు చేపట్టడం వల్లే రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణలో ఉందని ఉప రాష్ట్రపతి అన్నారని ఎంపీ తెలిపారు. పేద మధ్య తరగతి వర్గాల ప్రజలు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలు విస్తృతంగా చేపడుతున్నట్లు వెంకయ్య నాడుకు తెలిపినట్లు ఎంపీ వివరించారు. తమ కుటుంబం తరపున తాము కూడా సాధ్యమైనంతవరకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపామన్నారు. 


logo