గురువారం 09 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:04:49

ఉపరాష్ట్రపతికి గవర్నర్‌ బర్త్‌ డే విషెస్‌

 ఉపరాష్ట్రపతికి గవర్నర్‌ బర్త్‌ డే విషెస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బుధవారం  జన్మదినం జరుపుకోనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు గవర్న ర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తెలంగాణ ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, మంగళవారం న్యూఢిల్లీ ఉపరాష్ట్రపతిభవన్‌లో ఐసీటీ అకాడమీ రూపొందించిన ‘ఫ్యూచర్‌ ఎడ్యుకేషన్‌-నైన్‌ మెగా ట్రెండ్స్‌ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. 

వైద్యులకు గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు

నిస్వార్థసేవలందిస్తున్న వైద్యులందరికీ జూలై1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. కరోనాకు వ్యతిరేకంగా తెలంగాణలో, దేశంలో వైద్యులు అమూల్యమైన సేవలను అందిస్తున్నారని కొనియాడారు. 


logo