శుక్రవారం 29 మే 2020
Telangana - Feb 06, 2020 , 01:52:53

భక్తులకు శుభాకాంక్షలు

భక్తులకు శుభాకాంక్షలు
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మేడారం జాతరను పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ట్విట్టర్‌ వేదికగా ఆయన సందేశాన్ని తెలియజేశారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, ఆదివాసీ కుంభమేళాగా ప్రఖ్యాతి గాం చిందని పేర్కొన్నారు. రెండేండ్లకోసారి ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని వివిధ ప్రాం తాల నుంచి తరలివస్తున్న భక్తులందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.logo