శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 19, 2021 , 02:25:16

మళ్లీ ప్రగతిబాటలో ఆర్థికరంగం

మళ్లీ ప్రగతిబాటలో ఆర్థికరంగం

  • ఐసీఎస్‌ఐ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్‌, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో కొంత వెనక్కి తగ్గినట్టు కనిపించిన భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మళ్లీ ప్రగతిబాటలో పరుగులు పెడుతుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆశాభా వం వ్యక్తంచేశారు. ఈ ప్రగతిపథంలో భారత కార్పొరేట్‌ రంగం మరింత చొరవచూపాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) జాతీయ ఈ- స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభావాన్ని చూపినా భారత్‌ ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా వరకు విజయం సాధించిందని చెప్పారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్‌ అలీ, ఐసీఎస్‌ఐ అధ్యక్షుడు ఆశిష్‌ గార్గ్‌, సంస్థ కార్యదర్శి ఆశిశ్‌ మోహన్‌, సహకార్యదర్శి అంకుర్‌యాదవ్‌తోపాటు కంపెనీ సెక్రటరీలు, కంపెనీ సెక్రటరీ పట్టభద్రులు ప్రత్యక్షంగా, దేశంలోని నాలుగు ప్రధాన కేంద్రాలనుంచి వర్చ్‌వల్‌లో పాల్గొన్నారు.

VIDEOS

logo