ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 20:47:50

వీఐహెచ్ఈ ప్ర‌త్యేక కార్య‌క్రమంలో మాట్లాడ‌నున్న‌ ఉప‌రాష్ట్ర‌ప‌తి

వీఐహెచ్ఈ ప్ర‌త్యేక కార్య‌క్రమంలో మాట్లాడ‌నున్న‌ ఉప‌రాష్ట్ర‌ప‌తి

హైదరాబాద్: స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతకు నిరంతరం అందిస్తున్న ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ గురువారంతో 20 ఏళ్లు పూర్తి చేసుకొని.. 21వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ గత రెండు దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పరిపూర్ణత దిశగా యువతను మేల్కొలపడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ప్రత్యేక తరగతులతో యువతకు మార్గదర్శిగా నిలుస్తోంది. ఇప్పటికే 20 లక్షల మందికి పైగా యువతకు శిక్షణనిచ్చి.. తీర్చిదిద్దిన వీఐహెచ్ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 

వీఐహెచ్ఈ 21వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా జరగబోయే వర్చువల్ సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. విద్యార్థులను, యువతను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని రామకృష్ణ మఠ్ ఫేస్ బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో చూడొచ్చు. సెప్టెంబర్ 10, 11 తేదీలలో రెండు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.logo