బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:31

పెద్దపల్లి వైద్యుడికి ఉపరాష్ట్రపతి అభినందన

పెద్దపల్లి వైద్యుడికి ఉపరాష్ట్రపతి అభినందన

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి పట్టణంలో 45 ఏండ్ల వ్యక్తి ఆదివారం కరోనాతో మృతి చెందగా, మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మానవత్వంతో స్పం దించిన పెద్దపల్లి జిల్లా సర్వైవ్‌లెన్స్‌ అధికారి డాక్టర్‌ శ్రీరాం ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ వేదికగా అభినందించారు. మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలిస్తున్న పెండ్యాల శ్రీరాం ఫొటోను ట్యాగ్‌ చేసిన ఉప రాష్ట్రపతి, వైద్యుడి చొరవ అంకిత భావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. డాక్టరే డ్రైవర్‌గా మారి భౌతిక కాయం తరలించిన తీరును అభినందించారు.  logo