ఆదివారం 31 మే 2020
Telangana - May 17, 2020 , 23:03:58

అంకెల గారడీతో ప్రజలను వంచిస్తున్న కేంద్రం: వినోద్‌కుమార్‌

అంకెల గారడీతో ప్రజలను వంచిస్తున్న కేంద్రం: వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలు జీడీపీలో కేవలం 1.5 శాతమే కేటాయించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌. జీడీపీలో 10శాతం కేటాయించామని చెప్పడం పూర్తిగా మోసం. అంకెల గారడీతో ప్రజలను కేంద్ర ప్రభుత్వం వంచిస్తుందని మండిపడ్డారు. ఐదు రోజులుగా ఊకదంపుడు ప్రకటనలకే కేంద్రం పరిమితమైంది.  మొత్తం రూ. 20.97 లక్షల కోట్లలో రూ. 9.94 లక్షల కోట్లు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆర్.బీ.ఐ. లిక్విడిటీ మద్దతునిస్తోంది .

మొత్తం ప్యాకేజీలో కొత్త, పాత లింక్డ్ స్కీం ల విలువ రూ. 9.74 లక్షల కోట్లు.  వాస్తవానికి కేంద్రం ప్రకటించింది కేవలం రూ. 3.21 లక్షల కోట్లు మాత్రమే అని తేల్చి చెప్పారు. అమెరికా, యూరోపియన్ దేశాలతో పోల్చితే ఇవీ అతి తక్కువ నిధులు. ఎఫ్.ఆర్.బీ.ఎం. రుణాలపై రాష్ట్రాలకు ముందస్తు షరతులు విధించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది.  ప్రైవేటీజేషన్, డీ రెగ్యులేషన్, అండర్ టేకింగ్ రిఫర్మ్స్ లతో తక్షణ ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. 


logo