సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 02:26:27

వేయిపడగల మేధావి పుస్తకావిష్కరణ

వేయిపడగల మేధావి పుస్తకావిష్కరణ

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై సీనియర్‌ జర్నలిస్ట్‌ వెల్జాల చంద్రశేఖర్‌ రచించన వేయిపడగల మేధావి పుస్తకాన్ని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. మంగళవారం రవీంద్రభారతిలోని సాంస్కృతికశాఖ కార్యాలయంలో శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌, ఎంపీ కే కేశవరావు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వేయిపడగల మేధావి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి కాపీని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇటీవలే అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, అధికార భాషాసంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌రావు, ప్రముఖ పాత్రికేయుడు కే రామచంద్రమూర్తి, పీవీ కుమార్తె సురభి వాణీదేవి, కుమారుడు ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.