మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 12:24:57

బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ నరసింహారావు

బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ నరసింహారావు

హైదరాబాద్‌ : బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ నరసింహారావు అని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, స‌త్యవతి రాథోడ్ అన్నారు. మాజీ ప్రధాని దివంగత పీవీ న‌ర్సింహారావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్ వ‌ద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పీవీ మ‌న ఠీవీ అన్నారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగు వాడు..తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని తెలిపారు. పీవీ బహుముఖ ప్రజ్ఞశాలి అని కొనియాడారు. తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ దాతఅని కీర్తించారు.

ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారాన్నారు. కార్యక్రమంలో శాస‌న మండ‌లి చైర్మన్‌ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి, ప‌లువురు మంత్రులు, కే కేశ‌వ‌రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేష‌న్ల చైర్మన్లు త‌దిత‌రులు పాల్గొన్నారు. పీవీ సంస్కరణల స్ఫూర్తి తోనే, మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక పరిపాలన సంస్కరణలు తెస్తున్నారని గుర్తు చేశారు.

2020, జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు తెలంగాణ  ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని, వారి చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. పీవీ పుట్టిన ల‌క్నేపల్లి, పెరిగిన వoగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించి వారి కీర్తిని చాటిచెప్పారన్నారు.


logo