ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 19:07:00

వెంకటేశ్వ‌ర గ్రానైట్స్ ఉదార‌త‌.. విరాళంగా అంబులెన్స్

వెంకటేశ్వ‌ర గ్రానైట్స్ ఉదార‌త‌.. విరాళంగా అంబులెన్స్

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న ఉదార‌త‌ని చాటుకున్నారు. వెంక‌టేశ్వ‌ర గ్రానైట్స్ నుంచి క‌రోనా బాధితుల‌కు సేవ‌లందించేందుకు ఓ అంబులెన్స్ వాహనాన్ని విరాళంగా అంద‌చేశారు. అందుకు కావాల్సిన నిధుల‌ను చెక్కు రూపంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ స‌మ‌స్య‌గా మారింద‌న్నారు. క‌రోనా బాధితులు అంద‌రినీ ఆదుకోవ‌డం ఆరోగ్యంగా ఉన్న మిగ‌తా అంద‌రి బాధ్య‌త‌గా మారాల‌న్నారు. వెంక‌టేశ్వ‌ర గ్రానైట్స్ అధినేత వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న వంతుగా ఒక అంబులెన్స్ వాహ‌నాన్ని ఇవ్వ‌డానికి ముందుకు రావ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. 

ఈ సంద‌ర్భంగా వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఇచ్చిన పిలుపు మేర‌కు క‌రోనా రోగుల స‌హాయార్థం తాను ఒక అంబులెన్స్‌ను అంద‌జేసిన‌ట్లు తెలిపారు. డ‌బ్బులు సంపాదించ‌డం ఒక్క‌టే మార్గంగా ఉండొద్ద‌ని సంపాద‌న‌లో కొంత భాగాన్ని ఆప‌న్నుల‌ను ఆదుకోవ‌డానికి ఉప‌యోగించాల‌న్నారు. త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చిన మంత్రి ఎర్ర‌బెల్లికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.


logo