ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 12:35:07

వెంక‌టాపూర్ ప్రేమ‌జంట ఉస్మానియాలో మృతి

వెంక‌టాపూర్ ప్రేమ‌జంట ఉస్మానియాలో మృతి

హైద‌రాబాద్‌: సిద్దిపేట జిల్లా వెంక‌టాపూర్‌లో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన ప్రేమికులు మృతిచెందారు. ఉస్మానియా ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ ప్రేమికులిద్ద‌రు చ‌నిపోయారు. వెంక‌టాపూర్‌కు చెందిన ఆనంద్, హారిక గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే త‌మ పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఈనెల 8న వెంక‌టాపూర్ నుంచి వెల్లిపోయారు. హారిక క‌న్పించ‌క‌పోవ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 9న‌) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వెంక‌టాపూర్ స‌మీపంలో ఉన్న మామిడితోట‌లో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యయ‌త్నం చేశారు. వారికోసం వెతుకుతుండ‌గా మామిడితోట‌లో నిన్న‌ వారి ఆచూకీ ల‌భించింది. తోట‌లోని ఓ గ‌దిలో ఇద్ద‌రు అప‌స్మార‌క స్థితిలోప‌డిఉన్నారు. దీంతో ఆనంద్ తండ్రి వారిని ఉస్మానియా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆనంద్ నిన్న సాయంత్రం మృతిచెంద‌గా, హారిక ఈరోజు తెల్ల‌వారుజామున‌ క‌న్నుమూసింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo