బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 13:03:42

వేముల‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి స్థాయి పెంపు

వేముల‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి స్థాయి పెంపు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను బ‌లోపేతం చేస్తున్నది. ప్ర‌తి ఆస్ప‌త్రిలో ప‌డ‌క‌ల స్థాయిని పెంచుతూ.. మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న‌ది. ప్ర‌తి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తూ స‌ర్కార్ వైద్యంపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగిస్తున్న‌ది.

ఈ నేప‌థ్యంలో వేముల‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి స్థాయిని పెంచేందుకు ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేసింది. వేముల‌వాడ ఆస్ప‌త్రిని 30 నుంచి వంద ప‌డ‌క‌ల స్థాయికి ప్ర‌భుత్వం పెంచ‌నుంది. ఈ ఆస్ప‌త్రి స్థాయిని పెంచేందుకు రూ. 3.58 కోట్లు మంజూరు చేస్తూ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వేముల‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి స్థాయి పెంచేందుకు ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేయ‌డంతో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


logo