సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 11:12:01

టీఆర్ఎస్‌లో చేరిన‌‌ వేముల‌ఘాట్ ఎంపీటీసీ ‌

టీఆర్ఎస్‌లో చేరిన‌‌ వేముల‌ఘాట్ ఎంపీటీసీ ‌

సిద్దిపేట: ‌దుబ్బాక‌ ఉపఎన్నిక ప్ర‌చారంలో టీఆర్ఎస్ ‌పార్టీ దూసుకుపోతున్న‌ది. ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తూ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకుంటున్న‌ది. ఇందులో భాగంగా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ముంపు గ్రామ‌మైన వేముల‌ఘాట్‌ ఎంపీటీసీ ఘ‌ణ‌పురం క‌ల్ప‌న టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈరోజు ఉద‌యం ఆమె మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌ ‌పార్టీలో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి సాద‌రంగా ఆహ్వానించారు.  

ఎమ్మెల్లే రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో దుబ్బాక శాస‌న‌స‌భ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఆస్థానానికి ఉపఎన్నిక అనివార్య‌మ‌య్యింది. వచ్చేనెల 3న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఫ‌లితాల‌ను న‌వంబ‌ర్ 10న ప్ర‌క‌టిస్తారు. ఉపఎన్నికకు సంబంధించి ఈనెల 9న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది.  


logo