శనివారం 30 మే 2020
Telangana - Apr 01, 2020 , 00:46:08

రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలు

రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలు

-మీడియాతో మంత్రి వేముల

 కామారెడ్డి/నిజామాబాద్‌ జిల్లాల ప్రతినిధులు: నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వేర్వేరుగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి వేముల మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరిస్తామన్నారు. లాక్‌డౌన్‌కు ఇబ్బంది కలుగకుండా ఏ గ్రామంలో ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తామో ముం దుగానే ప్రకటిస్తారన్నారు. 


logo