శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 02:05:14

శాసనమండలిలో బడ్జెట్‌ పద్దు

శాసనమండలిలో బడ్జెట్‌ పద్దు
  • ప్రవేశపెట్టిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శాసనమండలిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనుమతించగా, మంత్రి వేముల  ప్రతిపాదించారు. ప్రశాంత్‌రెడ్డి తన బడ్జెట్‌ ప్రసంగాన్ని 11.33 గంటలకు ప్రారంభించి 12.38 గంటలకు ముగించారు. ఆయన ప్రసంగం చేస్తున్నపుడు పలువురు ఎమ్మెల్సీలు బల్లలు చరిచి హర్షం వెలిబుచ్చారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు వచ్చిన మంత్రి ప్రశాంత్‌రెడ్డిని ఎమ్మెల్సీలు స్వాగతించారు. మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ప్రశాంత్‌రెడ్డిని ఎంపీ సంతోష్‌కుమార్‌తోపాటు పలువురు శాసనమండలి సభ్యులు అభినందించారు. 


logo