గురువారం 04 జూన్ 2020
Telangana - May 21, 2020 , 01:40:49

ఔటర్‌పై వాహనాలకు అనుమతి

ఔటర్‌పై వాహనాలకు అనుమతి

  • ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు రాకపోకలు
  • భారీ వాహనాలకు 24 గంటలు పర్మిషన్‌  

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనాల రాకపోకలకు బుధవారం నుంచి అనుమతించారు. లాక్‌డౌన్‌తో మూసివేసిన ఓఆర్‌ ఆర్‌పై కేంద్ర మార్గదర్శకాలకు లోబడి వాహనాల రాకపోకలను అనుమతించినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. రాత్రి ఏడు  నుంచి ఉదయం ఏడు గంటల వరకు రాష్ట్రంలో కర్వూ ఉన్నందున ఆ సమయంలో వాహనాలను అనుమతించబోమన్నారు. ఔటర్‌ టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఔటర్‌పై భారీ వాహనాలకు 24 గంటలపాటు రాకపోకలకు అనుమతించారు. 


logo