శనివారం 30 మే 2020
Telangana - May 12, 2020 , 14:43:48

వలస కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా

వలస కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా

కామారెడ్డి : జిల్లాలోని సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. వలస కూలీలతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 20 మంది వలస కూలీలు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రకు వెళ్తుండగా వలస కూలీలు ప్రమాదం భారిన పడ్డారు.


logo