శనివారం 30 మే 2020
Telangana - May 17, 2020 , 02:26:59

వాహనదారులు లాక్‌డౌన్‌ తర్వాత కోర్టుకు రావాల్సిందే...

వాహనదారులు లాక్‌డౌన్‌ తర్వాత కోర్టుకు రావాల్సిందే...

హైదరాబాద్  : కరోనా నియంత్రణ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేసి, ఆయా వాహనాలను సీజ్‌ చేశారు. అయితే డీజీపీ ఆదేశాల మేరకు స్వాధీ నం చేసుకున్న వాహనాలను వివిధ షరతులతో వాహన యజమానులకు ఇస్తున్నారు. వాహనాలను ఇచ్చేముందు పోలీసులు వాహనదారుల నుంచి బాండ్‌, డిక్లరేషన్‌ రా యించుకుంటున్నారు.చార్జీషీటు దాఖలు చేసినప్పుడు కోర్టులో హాజరుకాకపోయినా.... నిర్లక్ష్యం చేసినా చట్టపరం గా తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

చట్టాన్ని ఉల్లంఘిస్తే.. కోర్డులో వాహనం విలువ కట్టాల్సి ఉంటుందంటున్నారు. ఎవరైనా కోర్టుకు రాకపోతే.. ద్విచక్రవాహనదారులైతే వేలల్లో, కార్ల యజమానులైతే లక్షల్లో  చెల్లించాల్సి ఉంటుంది. వాహనాలు ఇచ్చే ముందు వాహనదారులనుంచి ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. ఒకవేళ బాండ్‌ పోతే  ఇబ్బందులు తప్పవని పోలీసులు చెబుతున్నారు. 

30వేలకు పైగా వాహనాలు సీజ్‌

రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ల పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 30 వేలకు పైగా కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ పరిధిలో 20 వేలు, రాచకొండ పరిధిలో 10 వేలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇటీవల డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మే రకు వాహనాలను రిలీజ్‌ చేస్తున్నారు. రిలీజ్‌ సమయంలో పోలీసులు ద్విచక్రవాహనానికి రూ.500, కార్లకు రూ.1000, భారీ వాహనాలకు 2 నుంచి 5 వేల వరకు బాండ్‌లు తీసుకుని, వాహనదారులతో డిక్లరేషన్‌ను రా యించుకుంటున్నారు. 

ఇప్పటి వరకు దాదాపు 15 వేల వా హనాలను పోలీసులు విడుదల చేశారు. లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత వాహన ఉల్లంఘనదారులను కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఎవరైనా ఆసమయంలో నిర్లక్ష్యం చేసినా, తప్పించుకునేందుకు ప్రయత్నించినా కోర్టు ఆదేశం మేరకు కఠిన చర్యలు ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.   logo