సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 26, 2020 , 01:12:10

దిగొచ్చిన కూరగాయల ధరలు

దిగొచ్చిన కూరగాయల ధరలు

  • సీఎం హెచ్చరికలతో వెనుకకు తగ్గిన వ్యాపారులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ హెచ్చరికలు, మార్కెటింగ్‌శాఖ అధికారుల పర్యవేక్షణతో నిత్యావసరాలుసహా కూరగాయల ధరలు అదుపులోకి వచ్చాయి. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నేపథ్యంలో నగరవాసులంతా కొనుగోళ్లకు ఉపక్రమించడంతో గత రెండ్రోజులు రేట్లు కొండెక్కా యి. ప్రభుత్వ హెచ్చరికలతో బుధవారం వ్యాపారులంతా కాస్త దిగొచ్చారు. మార్కెటింగ్‌శాఖ సూచించిన ధరలకే విక్రయాలు జరిపారు. సరూర్‌నగర్‌, ఎర్రగడ్డ, మెహిదీపట్నం మార్కెట్లో నిత్యావసరాలు, కూరగాయల ధరలన్నీ తక్కువగానే ఉన్నట్టు ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో తేలింది. కూరగాయలు, నిత్యావసరాల కొరత తలెత్తకుండా విక్రయదారులకు పాస్‌లిస్తామని, పాల రవాణాకు చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.


logo