బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 28, 2020 , 16:21:50

కూరగాయల మార్కెట్ గా కరీంనగర్ బస్టాండ్

కూరగాయల మార్కెట్ గా కరీంనగర్ బస్టాండ్

కరీంనగర్ నగరంలోని పలు చోట్ల ఉన్న మార్కెట్ లలో ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడంతో  బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పలు చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద ఉన్న మార్కెట్ కారణంగా జనం గుంపులు గుంపులుగా పోగవుతున్నారని ఆ మార్కెట్ ను మూసివేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా కరీంనగర్ బస్టాండ్ ను మార్కెట్ గా మార్చి, సామాజిక దూరం పట్టించేలా రైతులకు, ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి మార్కింగ్ గీశారు. రద్దీ ఎక్కువ కాకుండా విశాలమైన బస్టాండ్ ఉపయోగపడుతుంది అని గంగుల కమలాకర్ అధికారులకు తెలిపారు. ఈ రోజు ఉదయం మంత్రి గారు ప్రత్యక్షంగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. ప్రజలకు, రైతులకు తగు సూచనలు చేశారు.


logo