బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 08, 2020 , 21:56:18

సీఎం సహాయనిధికి వావిలాల సర్పంచ్‌ విరాళం

సీఎం సహాయనిధికి వావిలాల సర్పంచ్‌ విరాళం

వరంగల్‌ : జిల్లాలోని నెల్లికుదురు మండలం వావిలాల గ్రామ సర్పంచ్‌ సీఎం సహాయనిధికి రూ. 50 వేలు విరాళం ప్రకటించారు. ఈ మొత్తానికి చెక్కును రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కు అందజేశారు. పెద్దవంగరలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ విరాళాన్ని మంత్రికి అందజేశారు. కరోనా బాధితుల కోసం, ప్రజల కోసం సీఎం కేసీఆర్‌ చేస్తున్న సహాయంలో తమ వంతు కృషిగా ఈ మొత్తాన్ని అందజేస్తున్న సర్పంచ్‌ పద్మా భాస్కర్‌ తెలిపారు. 


logo