e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home తెలంగాణ Dalit bandhu : పండ్ల, పూల సాగు ఎలా.. క్షేత్రస్థాయి పరిశీలనకు వాసాలమర్రి దళితులు

Dalit bandhu : పండ్ల, పూల సాగు ఎలా.. క్షేత్రస్థాయి పరిశీలనకు వాసాలమర్రి దళితులు

తుర్కపల్లి: ప్రభుత్వం మంజూరు చేసిన దళితబంధు నిధులతో వాసాలమర్రిలో దళితులు వివిధ యూనిట్ల ను నెలకొల్పే దిశగా వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో ఆగష్టు 4న వాసాలమర్రి గ్రామాన్ని రెండోసారి సందర్శించారు. గ్రామం లోని దళితవాడల్లో సుమారు 4 గంటల పాటు పర్యటించి ఒక్కో కుటుంబాన్ని పరామర్శిస్తు వారి యోగక్షే మాలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గ్రామంలోని రైతువేదిక భవనంలో దళితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామంలోని 76 దళిత కుటుంబా నికి రూ.10లక్షలు చొప్పున 7.60కొట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ అధికా రులు గ్రామంలోని దళితవాడలను సందర్శించి 15రోజుల పాటు ఇంటింటా తిరుగుతూ.. ఆయా కుటుంబాల ఆర్థిక స్థితి గతులు విద్యతో పాటు ఎవరెవరు ఏఏ పనులు చేస్తున్నారు, వృత్తి నైపుణ్యత, ఏ యూనిట్లను పెట్టుకుంటారు. అందులో ఉన్న అనుభవం తదితర అన్ని అంశాలను సేకరించారు. ఇటీవల 66మంది దళిత కుటుంబాల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు కూడా జమ చేశారు.

- Advertisement -

అందులో భాగంగా ఇప్పటికే లబ్ధిదారులు యూనిట్లను ఎంపిక చేసుకోగా ఈ నెల 9న వాసాలమర్రి నుంచి 29మంది దళితులను జిల్లాలోని ధర్మారెడ్డిగూడెం, కూనురు, రాయిగిరి, కందుకూరు గ్రామాల్లో విజయవం తంగా నడుస్తున్న డెయిరీ, గొర్రెలు, కోళ్లఫాంలను సందర్శించి లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.

ఇదేక్రమంలో రెండో విడుత మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హర్టికల్చర్ అధికారులు 27మంది దళితులను జిల్లాలోని పల్లెపహడ్, మేడిపల్లి, ముగ్దుంపల్లి, అనాజీపురం, గొల్లెపల్లి గ్రామాల్లో విజయవంతంగా సాగవుతున్న పండ్ల తోటలు, పూలు, కూరగాయల సాగుపై క్షేత్ర పరిశీలన చేసి లబ్ధిదారులకు సాగు విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా హర్టికల్చర్ అధికారి అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్‌సుందర్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్, ఎంపీడీవో ఉమాదేవి, హర్టికల్చర్ అధికారి సౌమ్య, పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి తదితరులున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana