అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 758 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, నలుగురు మృతి చెందారు. చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 895879కు చేరింది. ప్రస్తుతం 3469 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 885209కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7201కు చేరింది.