శనివారం 29 ఫిబ్రవరి 2020
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు

Feb 15, 2020 , 08:24:10
PRINT
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు

హైదరాబాద్ : సెంట్రల్‌ రైల్వేలో నిర్వహణ, మరమ్మతులు, డబుల్‌ లైన్‌ పనుల కారణంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీవరకు పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దుచేసినట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. మరికొన్నింటిని దారి మళ్లించినట్టు తెలిపింది. హైదరాబాద్‌- విజయపుర, విజయపుర- బొలారం, రాయిచుర్‌- విజయపుర, షోలాపూర్‌- హస్సన్‌, ముంబై ఎల్‌టీటీ- కరైకల్‌, చన్నై- అహ్మదాబాద్‌ రైళ్లను రెండువైపులా రద్దుచేసినట్టు పేర్కొన్నది. 


logo