బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 11:48:14

పొలంలో బయటపడ్డ వర్థమానుడి విగ్రహం

పొలంలో బయటపడ్డ వర్థమానుడి విగ్రహం

కరీంనగర్‌: తొలకరి వానలు పలకరించడంతో భూమిని సాగుకు సిద్ధం చేస్తుండగా వర్థమాన మహావీరుడి విగ్రహం బయటపడింది. జిల్లాలోని గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు అంజయ్య తన పొలంలో ట్రాక్టర్‌ దున్నుతుండగా జైన తీర్థంకరుడైన వర్థమాన మహావీరుడి విగ్రహం లభించింది. దీంతో విషయం తెలసుకున్న గ్రామ సర్పంచ్‌ తోట కవిత, ప్రజలు  వర్థమానుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు సర్పంచ్‌ వెల్లడించారు. రెండేండ్ల క్రితం ఇదే భూమిలో జైన తీర్థకరుడు పార్శనాథుని విగ్రహం లభించింది. 


logo