గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 19:58:32

వరవరరావుకు కరోనా పాజిటివ్

వరవరరావుకు కరోనా పాజిటివ్

ముంబై: విప్లవ రచయిత, కవి వరవరరావుకు కరోనా సోకింది. మహారాష్ట్రలోని భీమా కోరేగావ్ హింసా ఘటనకు సంబంధించిన కేసులో నిందితుడైన ఆయన సోమవారం రాత్రి అస్వస్థతకు గురికాగా ముంబై జైలు నుంచి జేజే ఆసుపత్రికి తరలించారు. అనంతరం కరోనా పరీక్ష నిర్వహించగా గురువారం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జేజే దవాఖాన డీన్ డాక్టర్ రంజీత్ మంకేశ్వర్ తెలిపారు. మరోవైపు వరవరరావు ఆరోగ్యంపట్ల ఆయన భార్య హేమలత, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కేసుపై 2018 ఆగస్టులో వరవర రావును పూణె పోలీసులు తొలుత అరెస్ట్ చేయగా కోర్టు ఆదేశంతో విడుదల చేశారు. అదే ఏడాది నవంబర్ నెలలో మళ్లీ ఆయనను అరెస్ట్ చేశారు. తొలుత పూణెలోని ఎరవాడ జైలులో వరవరరావును ఉంచారు. అనంతరం ముంబై జైలుకు ఆయనను తరలించారు. 81 ఏండ్ల వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తుండటంతోపాటు కరోనా నేపథ్యంలో ఆయనను విడుదల చేయాలని కోరుతూ 40 మంది ప్రముఖ రచయితలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోదీకి లేఖ రాశారు.logo