గురువారం 28 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 18:30:15

'వంశరాజ్‌ కులస్థుల సమస్యలు పరిష్కరిస్తాం'

'వంశరాజ్‌ కులస్థుల సమస్యలు పరిష్కరిస్తాం'

హైదరాబాద్‌ : వంశరాజ్‌ కుల సంఘం 2021 నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర‌ వెనుకబడిన తరగతులు, ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్క‌రించారు. నగరంలోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆదివారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే మంచి ఆశయంతో సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెనుకబడిన, ఇతర కులాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. 

కల్యాణలక్ష్మి, విదేశీ విద్య, మొదలగు పథకాలను ప్రవేశపెట్టి బీసీలను అన్నింటా ముందంజలో ఉంచేలా చూస్తున్నారన్నారు. త్వరలోనే వంశరాజ్‌ కులస్థుల సమస్యలన్నింటినీ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌, వంశరాజ్‌ కుల ప్రతినిధులు పాల్గొన్నారు.


logo