భద్రాద్రిలొ డిసెంబర్ 15 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

- ఏర్పాట్లకు సిద్ధమైన భద్రాద్రి ఆలయ అధికారులు
- 24న తెప్పోత్సవం.. 25న ఉత్తర ద్వార దర్శనం
- దశావతారాల్లో స్వామివారి దర్శనం
- జనవరి 4న ఉత్సవాల ముగింపు
భద్రాచలం : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబరు 15 నుంచి జనవరి 4 వరకు ‘శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలను’ నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ప్రక్రియ చేపట్టారు. ఇందు కోసం రూపొందించిన నివేదికను దేవస్థానం ఇవో బి.శివాజీకి ఆలయ వైదిక కమిటీ సభ్యులు అందజేశారు. డిసెంబరు 15 నుంచి 24 వరకు పగల్‌పత్తు సేవలు, డిసెంబరు 25 నుంచి జనవరి 4 వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే జనవరి 5 నుంచి 7 వరకు విలాసోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇవో తెలిపారు.
డిసెంబరు 15 నుంచి పగల్‌పత్తు ఉత్సవాలు
డిసెంబరు 15 నుంచి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి దశావతార అలంకారాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా డిసెంబరు 15న మత్స్యవతారం, 16న కూర్మావతారం, 17న వరహావతారం, 18న నరసింహావతారం, 19న వామనవతారం, 20న పరశురామవతారం, 21న శ్రీరామవతారం, 22న బలరామావతారం, 23న శ్రీ కృష్ణావతారంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా అవతారాల సమయంలో ప్రతి రోజు స్వామి వారిని అందంగా అలంకరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మేళతాళాల మధ్య అధ్యయనోత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం తిరువీధి సేవ నిర్వహిస్తారు.
డిసెంబరు 24న తెప్పోత్సవం
అధ్యయనోత్సవాల్లో భాగంగా డిసెంబరు 24న శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అలాగే తిరుమంగై ఆళ్వారు పరమపదోత్సవం నిర్వహిస్తారు. 25వ తేదీ తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే డిసెంబరు 25 నుంచి జనవరి 4 వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాపత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామి వారు భద్రాచలం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మండపాల్లో రోజుకో మండపంలో స్వామి వారు ప్రత్యేక పూజలను అందుకోనున్నారు. తొలి రాపత్తు సేవ డిసెంబరు 25న పట్టణంలోని డీఎస్పీ బంగ్లాలో ప్రారంభమై జనవరి 4న దసరా మండపంలో రాపత్తు సేవతో ముగస్తుంది.
అలాగే జనవరి 5 నుంచి 7 వరకు విలాసోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామదాసు మండపం, నృసింహదాస మండపం, వశిష్ట మండపాల్లో విలాసోత్సవాల్లో భాగంగా స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా జనవరి 10న భద్రాద్రి క్షేత్రానికే ప్రత్యేకమైన సర్వదేవతా అలంకారమైన ‘విశ్వరూప సేవ’ నిర్వహించనున్నారు.
తాజావార్తలు
- నేతాజీ కార్యక్రమం : దీదీకి తృణమూల్ ఎంపీ మద్దతు
- నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం
- బోస్ మరణంపై నెహ్రూ ఎందుకు దర్యాప్తు చేయించలేదు..?: బీజేపీ ఎంపీ
- నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : మంత్రి అజయ్‌కుమార్
- మీ అబ్బాయికి కాస్త చెప్పండి.. ప్రధాని మోదీ తల్లికి రైతు లేఖ
- రూ. పది కోట్లకు హ్యాకర్ల స్కెచ్
- ఆ మ్యాచ్ నుంచే స్టేడియంలోకి ప్రేక్షుకులకు అనుమతంట!
- రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి
- సూరత్‌లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసుల మృతి
- చైనాకు ఎయిర్‌ఫోర్స్ చీఫ్ వార్నింగ్