బుధవారం 03 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:23

తాకకుండా చెత్త సేకరణ

తాకకుండా చెత్త సేకరణ

  • కరోనా కట్టడికి వాక్యూమ్‌ గార్బేజ్‌ కలెక్టర్‌
  • జీహెచ్‌ఎంసీ పరిధి చందానగర్‌లో సేవలు

చందానగర్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో రోడ్లపై వాడిపారేసిన మాస్కులు, గ్లౌజ్‌ల సేకరణపై బల్దియా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం వాక్యూమ్‌ గార్బేజ్‌ కలెక్టర్‌ యంత్రం సేవలను ప్రారంభించారు. ఈ యంత్రాన్ని జీహెచ్‌ఎంసీ లోని శేరిలింగంపల్లి జోన్‌ చందానగర్‌ సర్కిల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. వాడి పారేసిన మాస్కులు, గ్లౌజ్‌లు, ఇతర కవర్లను పారిశుద్ధ్య కార్మికులు చేతులతో పట్టుకోకుండా వాక్యూమ్‌ గార్బేజ్‌ కలెక్టర్‌ సాయం తో సేకరిస్తారు. జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌ శనివారం ఈ యంత్రం పనితీరును పరిశీలించారు. ఇప్పటికే ఆర్మీ, రక్షణరంగాలతోపాటు బెంగళూరు, పుణె మున్సిపల్‌ కార్పొరేషన్లలో వీటిని వినియోగిస్తున్నారు.


logo