సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 12:54:23

టీకాల రాజధానిగా హైదరాబాద్‌ : మంత్రి కేటీఆర్

టీకాల రాజధానిగా హైదరాబాద్‌ : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ : ‌టీకాల రాజధానిగా హైదరాబాద్‌ విరాజిల్లుతోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆదివారం డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతి ఇవ్వడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తల కృషితో హైదరాబాద్‌కు ఎంతో ఖ్యాతి లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా టీకా కోసం కృషి చేసిన కంపెనీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.