గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 01:40:40

భారత్‌ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ ట్రయల్స్‌?

భారత్‌ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ ట్రయల్స్‌?

కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్‌లో భాగంగా భారత్‌ బయోటెక్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ వీకే శ్రీనివాస్‌ టీకా తీసుకున్నారు. దేశంలోనే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తొలి వ్యక్తి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్ట్‌ ఇది.  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : వ్యాక్సిన్‌ ఎప్పుడైనా భుజానికి ఇస్తారు. సోషల్‌మీడియాలో చక్కర్లుకొడుతున్న ఈ ఫొటో సాధారణ రక్త నమూనా సేకరణకు సంబంధింనదని భారత్‌ బయోటెక్‌ వివరణ ఇచ్చింది. సంస్థలో రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగానే పరీక్షకు సంబంధించినదని పేర్కొన్నది. అన్ని ప్రమాణాలు, జాగ్రత్తలతో వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తామని స్పష్టంచేసింది. త్వరలో మనుషులపై వ్యాక్సిన్‌ ప్రయోగించబోతున్నామని పేర్కొన్నది. 


logo